బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (16:18 IST)

పవన్ అద్భుతాలు సృష్టిస్తారు.. చిరంజీవితో కలిసి పని చేయాలి..

Sreya
ఏపీ డిప్యూటీ సీఎం పవన్, సినీ నటి శ్రియ కలిసి బాలు చిత్రంలో కలిసి నటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన విజయం అందుకున్నారు. ఆయన విషయంలో సహా నటిగా  తానెంతో గర్వంగా ఉన్నా. తామిద్దరం గతంలో "బాలు" కోసం కలిసి వర్క్‌ చేశామని తెలిపారు.
 
పవన్ ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటారని.. శ్రమపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో పవన్ కాలికి గాయమైంది. పాట షూట్‌ పూర్తయ్యే వరకూ ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదని శ్రియ వెల్లడించింది. 
 
ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ పవన్ తాపత్రయపడే వారని... ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని తాను నమ్ముతున్నానని శ్రియ తెలిపింది. అలాగే చిరంజీవితో కలిసి మరోసారి వర్క్‌ చేయాలనుకుంటున్నానని తెలిపింది.