గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (11:15 IST)

హాటెస్ట్ యాక్ట్రస్ గా శ్రియా శరణ్ కు కితాబు

Shriya Saran
Shriya Saran
నటి శ్రియా శరణ్ సోషల్ మీడియాలో రెగ్యలర్ టచ్ లో వుంటుంది తన అభిమానులతో. సందర్భానుసారాన్ని బట్టి ఏదో ఒక కాస్ట్యూమ్స్ తో అలరిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మధ్యలో నటిగా కొంత గేప్ తీసుకున్నా ఇప్పుడు మరలా నటిస్తోంది. ఒకపక్క పెండ్లయి, మాత్రుత్వాన్ని ఆస్వాదిస్తూనే  తన గ్లామర్ ను పెంచుకుంటుంది. అయినా ఫేస్ లో కాస్త నలత అనిపించినా ఆమె వేసుకునే డ్రెస్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది.
 
తాజాగా మై సౌత్ దివా అనే మ్యాగజైన్ కు ఈ ఏడాదికి చెందిన క్యాలెండర్ కు ఫొటో షూట్ చేసింది. వాటికి సంబంధించిన కవర్ ఫొటోను తన ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేయగా నెటిజన్లు బాగా స్పందించారు. ఇండియన్ సినిమాలో ఇప్పటికీ హాటెస్ట్ యాక్టర్ అంటూ కితాబిచ్చారు. ఇంకా మరిన్ని సినిమాలు చేసి అలరించండి అంటూ కొందరు పేర్కొన్నారు.