శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (14:59 IST)

సమంతతో కలిసి నటిస్తే క్రేజీగా వుంటుంది.. చూద్దాం.. చైతన్య

Samantha Akkineni
సమంత బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత కరణ్ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే పెళ్లి విడాకుల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
 
ఈ నేపథ్యంలో సమంతపై కోపంతో నాగచైతన్య సమంత జ్ఞాపకాలన్నింటిని చెరిపేసినట్టు తెలుస్తుంది. సమంతతో నాగచైతన్య కలిసి దిగినటువంటి ప్రైవేట్ ఫోటోలను చింపేశారని సమాచారం. ఇదే కాకుండా సమంత నాగచైతన్య కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం ఏం మాయ చేసావే సినిమా నుంచి వారిద్దరు కలిసి నటించిన సినిమాల అగ్రిమెంట్లను కూడా నాగచైతన్య చింపేశారని తెలుస్తోంది.
 
సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోవడంతో నాగచైతన్య కూడా లోలోపల ఎంతో బాధపడుతున్నారని సమాచారం. మొత్తానికి సమంత నాగచైతన్య ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి వైవాహిక జీవితం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా పనులతో ఎంతో బిజీగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
 
ఇకపోతే.. చైతన్య సమంతతో మళ్లీ కలిస్తారా నటిస్తారా అనే ప్రశ్నకు వాళ్లిద్దరూ కలిసి నటించే అవకాశమే లేదని చాలామంది భావిస్తున్నారు. నాగచైతన్యకు తాజాగా ఇదే ప్రశ్న ఎదురుకాగా చైతన్య ఆ ప్రశ్నకు స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సమంత మళ్లీ కలిసి నటిస్తే క్రేజీగా ఉంటుందని చైతన్య అన్నారు.
 
అయితే నేను సమంత కలిసి నటించడం జరుగుతుందో లేదో నేను చెప్పలేనని చైతన్య వెల్లడించారు. ఈ ప్రపంచానికే తెలియాలని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ నాగచైతన్య కామెంట్లు చేశారు.