1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ahaan Pandey and Aneeth Padda starrer Sayaaraa teaser released

అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా సైయారా టీజర్‌ విడుదల

Ahaan Pandey, Aneet Padda
Ahaan Pandey, Aneet Padda
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. YRF బ్యానర్ నుంచి వచ్చే  ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సైయారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు.
 
ఈ క్రమంలో అహాన్ పాండే, అనీత్ జంట ఎలా ఉండబోతోంది? అసలు వారిద్దరి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు టీజర్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ ‘సైయారా’ టీజర్‌ను రిలీజ్ చేశారు. సైయారా చిత్రాన్ని కంపెనీ CEO అక్షయ్ విధాని నిర్మించారు. ఇక ఈ మూవీ టీజర్‌ను గమనిస్తే.. ఇదొక ఇంటెన్స్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ప్రేమ కథను అంతే అందంగా తెరకెక్కించారు.
 
హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ, బ్రేకప్ వంటి సీన్లతో టీజర్‌ను అందంగా మలిచారు. ఇద్దరి నటన ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ అస్సెట్‌ కానున్నాయి. సైయారా అంటే ఆకాశంలోని ఒంటరి తార అని టీజర్ చూస్తే అర్థం తెలుస్తోంది.
 
50 సంవత్సరాల YRF చరిత్రలో ఎన్నో కల్ట్ రొమాంటిక్, ప్రేమ కథా చిత్రాలను అందించారు. ఇక మోహిత్ సూరి సైతం ఇది వరకు ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి అద్భుతమైన రొమాంటిక్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ‘సైయారా’ జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తర్వాతి కథనం
కరుణాద చక్రవర్తి నిమ్మశివన్న కి పెద్ది చిత్ర బృందం అభినందనలు