ప్లీజ్... నా కుమార్తెను వదిలేయండి: ట్రోలర్స్‌కు అజయ్ దేవగణ్ వేడుకోలు

ajay devgan
వాసుదేవన్| Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:18 IST)
ఎంత సినీ హీరో అయినా... తాను కూడా తండ్రినే అంటున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ఈ మేరకు తన కుమార్తె శరీరాకృతి గురించి, ఆమె ధరించిన దుస్తులను గురించి... ట్రోల్ చేస్తున్న వారికి ఆయన తన సమస్యని విన్నవించుకున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... తన కుమార్తె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమేనని, తన శరీరాకృతి, వేసుకునే దుస్తులపై వస్తున్న కామెంట్లతో ఆమె ఏడుస్తోందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వాపోవడం
జరిగింది. తన పిల్లల ఫొటోలు తీసి వాటిని పబ్లిష్ చేయవద్దని మీడియాను కోరిన అజయ్, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నెగటివ్ కామెంట్లు వస్తున్నాయని తెలియజేసారు. తనకున్న పాపులారిటీతో తన పిల్లలు ఇబ్బంది పడుతున్నారనీ, మీడియా తమపై చూపుతున్న అధిక శ్రద్ధపై వారు అసహనంతో ఉంటున్నారని అన్నారు.
 
మీడియా తీస్తున్న ఫొటోల్లో తాము సరిగ్గా కనిపించమేమోనన్న ఆందోళన వారిలో నెలకొని వుందనీ, ఇక ట్రోల్ చేస్తున్న వారైతే... పిల్లలన్న సంగతిని కూడా మరిచి.. అసభ్య కామెంట్లు పెట్టేస్తూంటే వాటిని చూసి పిల్లలు చాలా బాధపడుతున్నారనీ అన్నారు. తాను, తన భార్య సెలబ్రిటీలం కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోబోమనీ, కానీ తమ పిల్లలు చేసిన పాపం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించిన ఆయన, తన బిడ్డను వదిలేయాలని కోరారు. దీనిపై మరింత చదవండి :