గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (16:01 IST)

కాలుదువ్వుతున్న అఖండ‌

Akhanda
కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది. కారు కూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్ది! 
ఈ డైలాగ్ టీజ‌ర్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ `అఖండ‌`లోనిది. ఇప్ప‌టికీ 28 మినిలియ‌న్ వ్య్యూస్‌, 370కె. + లైక్స్ వ‌చ్చి బాల‌కృష్ణ సినిమాలోనే కొత్త‌తెర‌కు నాంది ప‌లికింద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తో విడుదల చేసిన టీజర్ మరిన్ని అంచనాలు పెంచింది.
 
కాగా, వేడిలో వేడిగా ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్టార్ మా వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు హక్కులకు సంబంధించి బాలయ్య కెరీర్ లోనే ఏ సినిమాకు పలకని ధర పలికినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు హక్కులు కలిపి 13 నుంచి 15 కోట్ల మధ్యలో డీల్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వహిస్తున్నారు.