ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (19:10 IST)

ఓవ‌ర్ సీస్‌లో అఖండ‌కు జేజేలు - మ‌హేష్‌బాబు థియేట‌ర్‌లో బాల‌కృష్ణ‌, బోయ‌పాటి సంద‌డి

AMB mall- Akhanda team
అఖండ సినిమా విడుద‌ల‌య్యాక వ‌చ్చిన ఫీడ్‌బేక్ బాల‌కృష్ణ‌కు, బోయ‌పాటి శ్రీ‌ను మంచి ఊపు నిచ్చింది. బాల‌య్య అభిమానులు నేను ఆశించిన‌ట్లే భుజాన మోస్తున్నారని బోయ‌పాటి వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్‌లో బాల‌య్య అభిమానుల‌తో కాసేపు మాట్లాడిన త‌ర్వాత థియేట‌ర్ రెస్పాన్స్‌కు ఆయ‌న వెళ్ళారు.
 
కొండాపూర్ లోని ఎ.ఎం.బి.మాల్ (మ‌హేష్‌బాబు థియేట‌ర్‌)లో సాయంత్రం 6.30గంట‌ల షోకు హాజ‌ర‌య్యారు.  బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుతోపాటు నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌తోపాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
 
ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్‌లో జై బాల‌య్య అంటూ థియేట‌ర్ల‌లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలుగుదేశం జెండాలు ప‌ట్టుకుని జై బాల‌య్య అనే నినాదాలు చేస్తూ కొన్ని థియేట‌ర్ల‌లో అభిమానులు సందడి చేశారు. ఆ వీడియోలు బోయ‌పాటి శ్రీ‌ను చూసి వారి అభిమానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.