మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (13:57 IST)

అక్ష‌య్ కుమార్ వ‌ర్సెస్ సూర్య‌

suriya-Akshay
బాలీవుడ్ అక్ష‌య్‌కుమార్ కోలీవుడ్ న‌టుడు సూర్య‌.పై దృష్టిపెట్టాడు.సూర్య న‌ట‌ను అవాక్క‌యాడ‌ట‌. ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైన సూర్య సినిమా `ఆకాశం నీ హ‌ద్దురా`. ఈ సినిమా ఓటీటీలో ప్ర‌శంస‌లు కురిపించింది. చూసిన వారంతా తెగ మెచ్చుకుంటున్నారు. సామాన్యుడు విమానం ఎక్కాల‌నే ఆశ‌తో ఆస‌క్తిక‌రంగా సాగిన క‌థ ఇది. దీనిని సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో త‌న తండ్రి చ‌న‌రిపోయిన సంద‌ర్భంగా దూరంగా వున్న సూర్య విమానం ఎక్క‌డానికి డ‌బ్బులేక ఎయిర్‌పోర్ట్‌లో అంద‌రినీ అడ్డుక్కునే విధానం క‌ల‌చివేస్తుంది. ఇదే ప్రేక్ష‌కుడికి క‌దిలించింది. అందుకే ఓటీటీలో మంచి ట్రెండ్ సెట్ట‌ర్గా నిలిచింది. ఈ సన్నివేశాన్ని చూసిన అక్ష‌య్‌కుమార్ త‌న‌నుతాను మ‌రిచిపోయాడ‌ట‌. వెంట‌నే ఈ సినిమాను తానే చేయ‌నున్న‌ట్లు నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు స‌మాచారం.
 
ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర బాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతుంది. ఇందులో సూర్య‌, అప‌ర్ణ బాల‌ముర‌ళీ మ‌ధ్య స‌న్నివేశాల‌తోపాటు జివీ ప్ర‌కాష్ సంగీతం ఆక‌ర్ష‌ణీయంగా వుంది. ఓటీటీలో ప్ర‌శ‌సంలు పొందిన ఈ సినిమాను హిందీలో అక్ష‌య్‌కుమార్ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.  ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ సౌత్ సినిమాలైన కాంచ‌న‌, తుపాకి, విక్ర‌మార్కుడు సినిమాలు చేసి మెప్పించాడు. తాజాగా వ‌రుణ్‌తేజ్ న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌నుకూడా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా `బ‌చ్‌ప‌న్ పాండేగా` రాబోతుంద‌. ఇక ఇప్పుడు ఆకాశం నీ హ‌ద్దురా సినిమా యూత్‌కు చక్క‌టి సందేశం వుంద‌ని ఈ సినిమా చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కురాలు సుద తెలియ‌జేస్తుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు రానున్నాయి.