ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (13:00 IST)

అల వైకుంఠపురంలో.. టీజర్.. అత్తారింటికి దారేదీని కాపీ కొట్టారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురంలో. ఈ చిత్రం టైటిల్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇక ఇటీవలే ఈ చిత్రం కాకినాడ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 
 
ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ హౌస్ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ విలువ రూ.5కోట్లని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
 
ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ నటి టబు, మురళి శర్మ, జయరాం, సుశాంత్, నవదీప్, నివేథా పేతురాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇకపోతే.. ఈ లుక్‌ పవన్ అత్తారింటికి దారేది సినిమాను కాఫీ కొట్టినట్లు ఉందంటూ పోస్టర్ అంటూ ట్రోల్స్ వేస్తున్నారు నెటిజన్లు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.