గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:58 IST)

గోవాలో సరదాగా తిరిగే రాఘవ లారెన్స్ హీరోయిన్ ఆత్మహత్య: చివరిసారిగా ఆమె చెప్పిందిదే

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం జరిగింది. కాంచన3లో దెయ్యం పాత్రలో నటించి సందడి చేసిన అలెగ్జాండ్రా డ్జావి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో తాను బసచేసిన హోటల్ రూంలో విగతజీవిగా పడి ఉండడం కలకలం రేపుతోంది.
 
మోడల్‌గా రాణించిన అలెగ్జాండ్రా ఆ తరువాత రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన3 సినిమాలో దెయ్యం క్యారెక్టర్లో నటించారు. కొన్నిరోజుల క్రితం ఆమె ప్రేమికుడితో మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. 
 
అప్పటి నుంచి ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిందని తెలుస్తోంది. ఆ బాధ తట్టుకోలేక హోటల్ గదిలో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు.
 
కాగా ఈమె తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రాంలో చివరిసారిగా ఇలా పోస్ట్ చేసింది, "మనమందరం మార్పులను పొందుతాము, కొంతమందికి మెరుగైన జీవితం కోసం మార్పులను ఎలా ఉపయోగించాలో తెలుసు, మరికొందరు గతం గురించి ఆలోచిస్తుంటారు, భవిష్యత్తు ఎలా వుంటుందో చూడలేరు."