పవన్ పగలబడి నవ్వారెందుకు? జుబ్బాలో అందంగా ఉన్నాడే.. మళ్లీ పెళ్లి చేస్తారా ఏంటి?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా మార్చి 24వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన సంగతి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా మార్చి 24వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన సంగతి విదితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో అలీ కూడా నటించాడు. అయితే, ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న పవన్ ఓ సందర్భంలో పగలబడి నవ్వాడు.
ఎప్పుడూ కామ్‌గా ఉండే పవన్ కల్యాణ్.. అంతగా పగలబడి నవ్వినందుకు కారణం ఏమిటా? అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పవన్ పక్కనే ఉన్న అలీ జోకు పేల్చడంతో పవన్ అలా నవ్వేసి వుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆ నవ్వు వెనక కథేంటో అలీ స్వయంగా చెప్పేశాడు.
ఆ రోజు ఏం జరిగిందంటే..? నిర్మాత శరత్ మరార్ వేదికపై మాట్లాడుతూ.. జుబ్బాలో పవన్ అందం రెట్టింపు అయ్యిందన్నారు. అదే సమయంలో పక్కనున్నవారితో ఇలా అన్నాను.. ఏంటీ పదే పదే హ్యాండ్సమ్‌గా ఉన్నారు. పవన్ అందం రెట్టింపు అయ్యిందని అంటున్నారు. కొంపదీసి మళ్లీ పెళ్లి చేస్తారా ఏంటి? అని అన్నాను. అంతే పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ ఈ మాటలు విని పగలబడి నవ్వారు. పవన్ అలా ఎందుకు నవ్వారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆయనకు చాలా ఫోన్లు వచ్చాయని అలీ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, కాటమరాయుడు సినిమా టిక్కెట్ల ధర పెరిగిపోయిందని టాక్. సామాన్యులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే పవన్ కల్యాణ్, కాటమరాయుడు సినిమా టిక్కెట్ల ధరను పెంచేస్తున్నారని వార్తలు రావడం ద్వారా విమర్శలకు గురవుతున్నాడు. త్వరలో విడుదల కాబోయే పవన్ చిత్రం కాటమరాయుడు నిర్మాతలు ఈ చిత్రం టికెట్లను అమాంతం పెంచేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అయితే మొదటి రెండు మూడు రోజుల్లోనే 30 కోట్ల వసూళ్లు సాధించాలన్న టార్గెట్‌తో పది రూపాయల టికెట్‌ను రూ.50ల టిక్కెట్టు రూ.200లకు పెంచనున్నారట. అలాగే రూ.150ల టికెట్‌ను రూ. 500లకు పెంచనున్నారని టాక్. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కాటమరాయుడు సినిమా సామాన్యుడికి దూరమయినట్టే. కాటమరాయుడు సినిమా టికెట్ల ధర పెంపుపై అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తీవ్రంగా స్పందించింది.