శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (13:31 IST)

బేబీ బంప్‌తో అలియా భట్.. ఫోటోలు వైరల్

Alia Bhatt
Alia Bhatt
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ త్వరలో తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఇదే ఏడాది ఆమె తమ ప్రియుడు రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.  ఏప్రిల్ 17న వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బాంద్రాలో వీరి వివాహం జరిగింది. 
 
అంతేకాదు కాదు అలియా కొద్దిరోజులకే తల్లి కాబోతున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తుందేమో అని అంతా అనుకున్నారు.
 
కానీ అలాంటిది ఏమీ లేదని రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకుంటానని.. డాక్టర్ల సలహా మేరకు ఇప్పుడు షూటింగ్‌లు చేసుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఇదిలా ఉండగా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే చిత్రంలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుండీ ఆమె బేబీ బంప్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.