1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (16:34 IST)

మెగాస్టార్ట్, పవన్ అభిమానులు అందరూ మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ చిత్రాన్నిహిట్ చెయ్యాలి : సుమన్

sumar, gourd and others
sumar, gourd and others
మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా శ్రీ లక్ష్మణ్  దర్శకత్వంలో  సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం "మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి, రామసత్యనారాయణ, దర్గా చిన్నా (పహిల్వాన్), తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత లక్ష్మీపతి, దిల్ రమేష్, గీతా సింగ్, పింగ్ పాంగ్ సూర్య, జగదీశ్వర్, మమత తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..* మా తల్లి చెన్నైలో ఒక స్కూల్ కు ప్రిన్సిపాల్.  సూపర్ స్టార్ కృష్ణ  కూతురు, శోభన్ బాబు కూతురు, తమిళనాడు గవర్నర్ కూతురు మా అమ్మ స్టూడెంట్స్. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. మా అమ్మ ఎంతోమంది పేద  విద్యార్థులకు తన సొంత డబ్బుతో చదువు చెప్పించింది. మా తల్లి తండ్రులు చేసిన పుణ్యం ఒక ఎత్తయితే  నన్ను నమ్మి నాకు సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతల పుణ్యమే నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టేలా చేసింది..మొదట దర్శకుడు గ్యాంగ్ లీడర్  కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. రైతులు ఇబ్బందులు పడుతున్న ఒక బర్ణింగ్ ఇష్యూపై నా క్యారెక్టర్ ఉంటుంది. రైతు పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఎందుకంటే రైతులేని  రాష్ట్రం లేదు, రైతులేని దేశం లేదు.  కరోనా టైం లో మనము బయట పడ్డాము అంటే ఆది రైతు వలనే. వారి ద్వారానే మనందరికీ ఫుడ్ లభించింది. వారు చేసిన కష్టం ఎప్పటికీ మరువలేము. ఇలాంటి మంచి చిత్రంలో రైతు  పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. చిరంజీవి అభిమాని అయిన మోహన్ కృష్ణ ఇందులో హీరోగా చాలా బాగా నటించాడు. మంచి కాన్సెప్ట్ తో తీసిన  ఈ సినిమాను అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా తీయడం జరిగింది . చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను  మేఘా అభిమానులు, పవన్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూసి బిగ్ హిట్ చేసి నిర్మాత సింగూలూరి మోహన్ రావు గారికి సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ, చిన్న పాయింట్ ను తీసుకొని సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త కథను సెలెక్ట్ చేసుకొని ఒక రైతు మీద , ఫ్రెండ్స్ మీద, రాజకీయం, స్నేహం ఇలా ఒక ఐదు బర్నింగ్ ఇష్యుస్ గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. నేను హీరోగా నటించినా ఈ సినిమాకు అసలు హీరో సుమన్ గారే. తను ఇందులో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నటించడం జరిగింది. ఇందులో ఉన్న ఆరు పాటలకు ఘనష్యామ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఐదు ఫైట్స్ కు  రామ్ సుంకర బాగా కంపోజ్ చేశారు. నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మొదట  టైటిల్ గురించి డిస్కషన్ చేస్తున్న మాకు ప్రసన్న కుమార్ గారే ఈ టైటిల్ పెట్టమని చెప్పారు. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు శ్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ, రైతు గురించి మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసిన ఈ సినిమా లో జై కిషన్, జై జవాన్ అనే నినాదం ఎంత గొప్పదో ఈ చిత్రంలో చూడచ్చు. సినిమాకు ఘనష్యామ్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ మురళి అద్భుతమైన విజువల్స్ అందించాడు  ఇలా ఇందులో అందరు టెక్నిషియన్స్ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో జులై 7 న వస్తున్న  మా సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.