సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (10:52 IST)

చెప్పు.. ఎందుకు ఇంత క్యూట్‌ గా వున్నావో అంటున్న అల్లు అర్జున్‌

Allu Arjun, allu arha
Allu Arjun, allu arha
పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ షూటింగ్‌ తర్వాత ఇంటిలో వున్నప్పుడు తన పిల్లలతో సామాన్యుడిలా మారిపోతారు. సహజంగా ప్రతి తండ్రికి తమ పిల్లలపై ప్రేమ ఎక్కువ. కొంతమంది మరీ ఎక్కువ. చిన్నపిల్లలతో ఆడుకుంటూ వారితో కలిసిపోయి నవ్వుతూ, కేరింతలు కొడుతు తమ మైండ్‌ను రిఫ్రీష్‌ చేసుకుంటుంటారు. అందులో ఐకాన్‌ స్టార్‌ మినహాయింపుకాదు.
 
డాటర్స్‌డే సందర్భంగా తన కుమార్తె అల్లు ఆర్హతో ఆడుకుంటూ ఎత్తుకుని కుమార్తె అంటే తనకెంతో ప్రేమ అని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో వీడియో విడుదల చేశారు. రెండు చేతులతో పైకెత్తి ఆడుకుంటూ.. చెప్పు.. నువ్వెందుకు ఇంత క్యూట్‌ వున్నావో! చిక్కు.. చిక్కు.. అంటూ మురిపెంగా ఆడుకుంటూ కనిపించారు. వెంటనే ఆర్హ... నాకు చాలా క్యూట్‌ ఇష్టం. అంటుంది. ఆ వెంటనే అల్లు అర్జున్‌.. నాకూ చాలా చాలా క్యూట్‌ ఇష్టం. నువ్వంటే ఇష్టం.. నువ్వంటే పిచ్చి.. అంటూ ఆర్హతో ఆడుకుంటున్న వీడియో ప్యాన్స్‌లో వైరల్‌ అవుతోంది.