ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (17:29 IST)

అల్లు అర్జునా మజాకా! ఇంటి దగ్గర ఫ్యాన్స్‌ సందడి

Allu arjun fans his house
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఏది చేసినా ప్రచారంలో ముందుంటారు. ఆయన పుట్టినరోజు నాడు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం దగ్గర అభిమానులు సందడి అంతా ఇంతాకాదు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవికి ఆ క్రేజ్‌ వుండేది. ఇప్పుడు ఆయన కొడుకు రామ్‌చరణ్‌ కూడా అలా లేదు. తను స్టార్‌అయినా ఇలా పబ్లిసిటీ ఫ్యాన్స్‌ సందడి తక్కువనే చెప్పాలి. ఆర్‌.ఆర్‌.ఆర్‌.తో గ్లోబర్‌ స్టార్‌ అయినా, విదేశాల్లోనూ, బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ అంతా ఇంతాకాదు. కానీ హైదరాబాద్‌ వచ్చాక చరణ్ కు పరిమిత సంఖ్యలో శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Alluarjun his house with fans
Alluarjun his house with fans
కానీ అల్లు అర్జున్‌కు అలా కాదు. నిన్ననే ఢిల్లీ లో రాష్ట్రపతి నుంచి 69వ జాతీయ అవార్డును పుష్పకు అందుకున్న సందర్భంగా తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. ఆయన వచ్చాడని తెలియగానే  అభిమానులు పోటెత్తారు. ఆయన ఇంటి ముందు వేలాదిగా వచ్చి అరుపులు, కేకలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల నుండి స్వాగతం లభించింది. పుస్ప 2 ఎప్పడు అంటూ.. నినాదాలు చేయడం  విశేషం.