ఆదివారం, 9 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (11:05 IST)

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Allu Arjun-Sneha Reddy 14th wedding cake cutting
Allu Arjun-Sneha Reddy 14th wedding cake cutting
పలు వివాదాల నడుమ పుష్ప -2 విజయాన్ని సరిగ్గా జరుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అల్లు అర్జున్ నిన్న తన  14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి కేకు కట్ చేసి ఫొటోలు  సోషల్ మీడియాలో పెట్టాగానే వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంటిలో గార్డెన్ లో తన కుటుంబసభ్యులు, స్టాఫ్ సమక్షంలో వేడుక జరుపుకున్నారు. దర్శుకుడు సుకుమార్, త్రివిక్రమ్ వంటి వారు శుభాకాంక్షలు తెలియజేసారు.
 
తమది ప్రేమ వివాశం అని అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. 2010 నవంబర్‌ 26న ఘనంగా ఈ జంట నిశ్చితార్థం జరిగింది.మూడు నెలలకు 2011 మార్చి 6న వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అల్లు అర్జున్‌- స్నేహ దంపతులకు కుమారుడు అల్లు అయాన్‌తో పాటు కూతురు ఆర్హ ఉంది. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ సరికొత్త సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్, సుకుమార్ చేయాల్సి ఉంది. ఈ ఉగాదికి తాజా అప్ డేట్ ఇవ్వనున్నట్లు సన్నిహితులు తెలిపారు.