సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:35 IST)

అన్నకు బాగా వర్కవుటైంది.. మరి తమ్ముడి పరిస్థితేమిటో!

సంచలన హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు. అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్నా చితకా పాత్రలతో కాలం గడిపేస్తూ వచ్చిన విజయ్‌కి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మంచి టర్న్ ఇచ్చింది. ఈ సినిమాలో లిప్‌లాక్స్ బాగా ఎక్కువయ్యాయంటూ టాక్ వచ్చినప్పటికీ దాని ప్రభావం సినిమాపై ఏమాత్రం చూపలేదు. అప్పటి నుండి దాదాపు అన్ని సినిమాల్లోనూ విజయ్ లిప్‌లాక్స్ కంటిన్యూ చేసేస్తున్నాడు.
 
‘గీత గోవిందం’లోనూ అలాగే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘డియర్ కామ్రేడ్‌’ టీజర్‌లోనూ దాదాపు అర నిమిషంపైనే లిప్‌లాక్ సీన్ ఉండడం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా... విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ వెండితెరపై తళుక్కుమనబోతున్నాడు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ‘దొరసాని’ అనే చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆనంద్ కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది.
 
ఈ చిత్రంలో రాజశేఖర్, జీవితల చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా... త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్ర టీజర్‌లోనూ ఒక లిప్‌లాక్‌ని సీన్ ఉంటుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఈ తమ్ముడు కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడని అర్థమవుతోంది. అయితే విజయ్‌కి బాగా వర్కవుట్ అయిన లిప్‌లాక్ సీన్లు తమ్ముడు ఆనంద్‌కి వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూద్దాం మరి.