శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (15:27 IST)

''దొరసాని''గా శివాత్మిక.. హీరోగా అర్జున్ రెడ్డి తమ్ముడు..

టాలీవుడ్‍‌లోకి అర్జున్ రెడ్డి తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ.. స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. పెళ్లి చూపులతో అం

టాలీవుడ్‍‌లోకి అర్జున్ రెడ్డి తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ.. స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. పెళ్లి చూపులతో అందరినీ ఆకట్టుకుని, అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగాడు.


గీత గోవిందం సినిమాతో భారీ కలెక్షన్లు కుమ్మేశాడు. త్వరలో నోటాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం తనకున్న క్రేజ్‌తో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు.
 
తమ్ముడు ఆనంద్ డెబ్యూ మూవీని సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి ''దొరసాని'' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాను ''ఫిదా'' టైపులో పూర్తి తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారని సమాచారం. అక్టోబర్ 10న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో యాంగ్రీమెన్ రాజశేఖర్ చిన్నకుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.