శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (18:56 IST)

సాలే.. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం? తీవ్రస్థాయిలో ఫైరైన రష్మీ

పాకిస్థాన్ వైఖరిపై యావత్తు భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. భారతీయులందరూ తమ జవాన్ల వీరమరణానికి నీరాజనాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ వుంటూ కొందరు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటివారిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సిద్ధూ పాకిస్థాన్‌కు వత్తాసు పలికారు. 
 
ఉగ్రవాదానికి దేశంతో గానీ, మతంతో గానీ సంబంధం లేదని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైన సిద్ధూపై యాంకర్ రష్మీ తీవ్రస్థాయిలో మండపడింది. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడుతున్న సిద్ధూ.. దేశ విభజన సమయంలో అక్కడికే వెళ్లిపోవాల్సింది. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పటికీ ఇక్కడే వుండిపోయారని అసహనాన్ని వ్యక్తం చేసింది. 
 
ఇంకా పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ షోయెజ్ హఫీజ్ అనే నెటిజన్ చేసిన ట్వీట్‌కి రష్మీ తీవ్రస్థాయిలో మండిపడింది. ''సాలే.. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం?.. మాతోనే నీ అస్తిత్వం.. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా? మూసుకుని కూర్చో.. లేదంటే పాకిస్థాన్‌కి వెళ్లిపో..'' అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. 
 
మరోవైపు పుల్వామా ఉగ్రదాడిపై సినీ నటి కంగనా రనౌత్ మండిపడింది. జరిగిన దారుణ ఘటనతో దేశమంతా రగిలిపోతోందని... ఇలాంటి సమయంలో శాంతి గురించి మాట్లాడేవారికి బుద్ధి చెప్పాలని మండిపడింది. మన దేశ గౌరవంపై పాక్ దెబ్బకొట్టిందని, అవమానానికి గురి చేసిందని తెలిపింది. ఈ సమయంలో ఆ దేశంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
అలాగాకుండా మౌనం వహిస్తే.. మనల్ని పిరికివారి కింద జమకడతారని చెప్పింది. జవాన్లను చంపడమంటే మనందరి కడుపులో కత్తులు దింపినట్టేనని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో శాంతి, అహింస అని మాట్లాడేవారిని గాడిదపై ఊరేగించాలని చెప్పింది.