మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (17:16 IST)

జపనీస్ అవతార్‌లో అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran,
Anupama Parameswaran,
అనుపమ జపనీస్ అవతార్‌లో ముఖ్యంగా కిమోనోలో చాలా అందంగా ఉంది. ఆమె తన బబ్లీ స్మైల్‌తో అద్భుతంగా కనిపించింది. మ్యూజిక్ వీడియో ఎక్సయిటింగా వుంది. ఇది ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో కల్చర్ ని వేరే స్థాయికి తీసుకువెళుతోంది.
 
తెలుగు సినిమాలానే మ్యూజిక్ కల్చర్ కూడా అద్భుతం గా ఎదుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన న్యూ ఏజ్ మ్యూజిక్ వీడియో ఆసక్తికరంగా కనిపించడమే కాకుండా మ్యూజిక్ కల్చర్ ని న్యూ లెవల్ తీసుకువెళుతుందని భరోసా ఇస్తోంది. ఈ పాటకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించారు. ఈ పాటకు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు.
 
పద పద అని సాగే ఈ పాట టోక్యోలో చిత్రీకరించబడిన మొదటి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియో. బాబీ ఫిల్మ్స్, అయేరా స్టూడియోస్, యు రూబీ నాజ్ నిర్మిస్తున్నారు. సాహిత్యం కృష్ణకాంత్, కొరియోగ్రఫీ విష్ణుదేవా.
 
విజువల్స్ టోక్యో కొని అందమైన దృశ్యాలతో ఆహ్లాదకరంగా వున్నాయి. పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. మ్యూజిక్ వీడియో జపాన్ స్పిరిట్, స్వేచ్ఛాయుతమైన అమ్మాయిని ప్రజంట్ చేస్తోంది.