నాగచైతన్యతో జతకట్టనున్న కీర్తి సురేష్?
హీరో నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి మళ్లీ కలిసి పని చేయనున్నారు. వీరిద్దరూ గతంలో మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగు వెర్షన్ ప్రేమమ్‌లో కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
తాజాగా నాగచైతన్యకు హిట్ ఇచ్చేందుకు చందూ మొండేటి రెడీ అయ్యారు. GA2 పిక్చర్స్ దీనిని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కోసం చైతూ సరసన కీర్తి సురేష్‌ను నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇప్పటివరకు నాగ చైతన్యతో కీర్తి సురేష్ మహానటిలో కనిపించింది. ఇక తాజా చిత్రం ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.