గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:28 IST)

సాయిధరమ్‌కు అంతర్గత అవయవాల పనీతీరు భేష్ : అపోలో ఆస్పత్రి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుపై అపోలో వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. సాయితేజ్ శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని అందులో పేర్కొన్నారు. 
 
సాయితేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ అవసరం తగ్గుతోందని తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని పేర్కొన్నారు. బయోమెడికల్ టెస్టుల నివేదికలు సంతృప్తికరంగా ఉన్నాయని వివరించారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్‌లో పేర్కొన్నారు.