గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (08:26 IST)

బాబా ఆశీస్సులతో సాయిధరమ్ ఆరోగ్యంగా ఉన్నాడు.. కలెక్షన్ కింగ్

మెగా అభిమానులకు సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శుభవార్త చెప్పారు. సాయిబాబా ఆశీస్సులతో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. మరో రెండు మూడు రోజుల్లో సంపూర్ణంగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్, జూబ్లీ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ను పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా సాయి తేజ్ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
 
తాజాగా మంచు మోహ‌న్ బాబు త‌న కూత‌రు మంచు ల‌క్ష్మీతో క‌లిసి అపోలో ఆసుప‌త్రికి చేరుకొని సాయి ధ‌ర‌మ్ తేజ్‌ని ప‌రామ‌ర్శించారు. సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు.
 
మోహ‌న్ బాబు వ్యాఖ్య‌లు అభిమానుల‌కి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించిన‌ట్టు అయింది. రీసెంట్‌గా సాయి తేజ్‌కి కాల‌ర్ బోన్ సర్జ‌రీ చేయ‌గా, అది స‌క్సెస్ అయింది ఆయ‌న క్రమక్ర‌మంగా కోలుకుంటున్నాడ‌ని, 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల‌ని వైద్యులు అన్నారు. సెప్టెంబ‌ర్ 10న కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయి అదుపుతప్పి పడిపోయిన విష‌యం తెలిసిందే.