శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (18:51 IST)

రొమాన్స్ నేర్చుకున్నానంటున్న అప్స‌రా రాణి

DANGEROUS working still
అప్స‌రారాణి వాంప్ పాత్ర‌ల‌కు ప్ర‌సిద్ధి. క్ల‌బ్ డేన్స్‌ల‌కు ఫేమ‌స్‌. క్రాక్ సినిమాలో ఆమె వేసిన డాన్స్ యూత్‌ను అల‌రించింది. ప‌లు సినిమాల్లో భిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించే అప్స‌రా ఇటీవ‌లే రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `డేంజ‌ర‌స్‌` సినిమాలో న‌టించింది. ఆ సినిమా స్పార్క్ ఓటీటీలో రేపు విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆ సినిమాకు సంబంధించిన బిహైండ్ సీన్‌ను అప్స‌రా పోస్ట్ చేసింది. రామ్‌గోపాల్ వ‌ర్మ ఫోన్ చేతిలో ప‌ట్టుకుని నైనా గంగూలితో రొమాన్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాడు. దానికి ఆమె స్పందిస్తూ, తెర వెనుక మీ కృషిని ప్రేమిస్తున్నా.చాలా సన్నివేశాల్లో ఇంత ఎమోషనల్ అవ్వడం నాకు గుర్తుంది. మీతో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం సర్. నేను మీ నుండి చాలా నేర్చుకున్నాను. అంటూ వ్యాఖ్య‌లు పెట్టింది.
 
మ‌రి నైనా గంగూలి కూడా త‌క్కువేమీ కాదు. ఇంత అత్యుత్తమమైన, సృజనాత్మకమైన, వినూత్నమైన డైరెక్టర్ వ‌ర్మ సార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అంటూ పేర్కొంది. అంతేకాకుండా అప్స‌రా త‌న‌తో రొమాన్స్ చేసే స్టిల్‌ను కూడా పోస్ట్‌చేసింది.ఇక ఈ సినిమా క‌థ అప్స‌రా, నైనా అనే ఇద్ద‌రి లెస్‌బియ‌న్ మ‌ధ్య జ‌రిగే క‌థ‌. ఒక‌రిపై ఒక‌రు రొమాన్స్‌ను ఎలా వ్య‌క్తం చేయాలో త‌న చేతిలోని ఫోన్ వీడియోను చూపిస్తూ వ‌ర్మ వారిచేత చేయించ‌డం వినేవారికే థ్రిల్ వుంటే, మ‌రి చేయించే వారికి ఎలా వుంటుందో గ‌దా.