గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (16:43 IST)

చిరంజీవి అభిమానిగా నేను మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తా:, దర్శకుడు మెహర్ రమేష్

Director Mehr Ramesh,
Director Mehr Ramesh,
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ మెగా మాస్ టీజర్ విడుదలయి మంచి ఆదరణ పొందింది. మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్  స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించడం ఎప్పుడూ కన్నుల పండువగా ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్  మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘భోళా శంకర్’ లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. 
 
డడ్లీ తన అద్భుతమైన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్ టార్డినరిగా వుంది . థీమ్ సాంగ్ పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇస్తుంది. ఓవరాల్ గా టీజర్ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.
 
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ గారిలో మనకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయి.  అభిమానులని, ప్రేక్షకులని అందరినీ ఈ సినిమా అలరిస్తుంది. అన్నయ్య సంక్రాంతి కి వాల్తేరు వీరయ్యగా వచ్చారు. ఆగస్ట్ 11న మనం మళ్ళీ మెగా ఫెస్టివల్ చేసుకుంటాం.  ఈ సినిమా విడుదలే మనకి పండగ. నిర్మాత అనిల్ సుంకర గారితో పాటు అందరం మెగాస్టార్ గారికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని ప్రేమతో కష్టపడ్డాం. బాలీవుడ్ లో అనే సూపర్ హిట్ చిత్రాలు పని చేసిన కెమరామెన్ డడ్లీ గారు ఈ చిత్రానికి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మహతి సాగర్ మెగా సౌండ్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులని అభిమానులని అలరించాలని చిరంజీవి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వేగాన్ని అందుకోవడం మనకి కష్టం. ఆగస్ట్ 11న థియేటర్ లో కలుద్దాం. ఇక నుంచి మెగా సెలబ్రేషన్స్ , భోళా మానియా బిగిన్. అభిమానుల్లో నుంచి వచ్చి దర్శకుడైన నేను మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తానని నమ్మకంతో చెబుతున్నాను’’ అన్నారు