బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (17:00 IST)

ఏఎస్ రవికుమార్ చౌదరి కొత్త చిత్రం ఫ్లాష్ బ్యాక్ - లేనిది ఎవరికి? పేరు ఖరారు

AS Ravikumar Choudhary
AS Ravikumar Choudhary
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఎఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'FLASH BACK' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. 'లేనిది ఎవరికి?' అనే క్యాప్షన్ క్యురియాసిటీని క్రియేట్ చేసింది.  
 
న్యూ ఏజ్ స్టొరీతో రాబోతున్న ఈ మూవీకి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తుండగా, జేబీ మ్యూజిక్ అందిస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీను లిరిక్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రైటర్ డైమండ్ రత్నం బాబు. ఫైట్ మాస్టర్ గా వెంకట్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన నటీనటులు, ఇతర వివరాలని మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.