లడ్డూ వివాదం- ప్రకాష్ రాజ్ Vs మంచు విష్ణు.. లిమిట్స్‌లో వుండండి..
సినీనటుడు ప్రకాశ్ రాజ్ లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని, దయచేసి దీనిపై విచారణ జరపాలని అన్నారు. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అంతేగానీ, దీనిపై ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని, ఈ సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారని అన్నారు. ఇప్పటికే దేశంలో ఎన్నో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిపారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు "మా"అధ్యక్షులు మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్ రాజ్ దయచేసి నిరుత్సాహం, అసహనం ప్రదర్శించవద్దని హితవు పలికారు. పవిత్రమైన దేవాలయంలో లడ్డూ వివాదంకు సంబంధించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కోరారు.
ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి అని మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌కు ట్విట్టర్ వేదికగా సూచించారు.