బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (08:28 IST)

దేశవ్యాప్తంగా 1000 ధియేటర్లలో బాహుబలి ది బిగినింగ్: నేడే చూడండి

బాహుబలి సినీ మేనియా మళ్లీ మొదలైంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం రెండో భాగం ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో భారతీయ హిందీ ప్రేక్షకులకు జిరిగిన కథను మళ్లీ గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా బాహుబలి తొలి భాగాన్ని ఈరోజు నుంచి మళ్లీ ప్ర

బాహుబలి సినీ మేనియా మళ్లీ మొదలైంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం రెండో భాగం ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో భారతీయ హిందీ ప్రేక్షకులకు జిరిగిన కథను మళ్లీ గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా బాహుబలి తొలి భాగాన్ని ఈరోజు నుంచి మళ్లీ ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా 900 థియేటర్లలో ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను ప్రదర్శిస్తున్నట్లు బాలీవుడ్ ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.


 
పాత సినిమాలలో సూపర్ డూపర్ హిట్ అయిన వాటిని అయిదేళ్లకో పదేళ్లకో మళ్లీ విడుదల చేయడం గతంలో తెలుగులోనే కాకుండా అన్ని భారతీయ సినిమాల విషయంలో జరిగింది. తరణ్ ఆదర్శ్ దీన్నే గుర్తు చేస్తూ హిందీ ప్రేక్షకులకు బాహుబలి తొలి భాగాన్ని రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యాన్ని వివరించారు. 
 
‘1970, 1980, 1990లలో హిట్‌ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం సాధారణంగా జరిగేది. అలా మళ్లీ ‘బాహుబలి ది బిగినింగ్‌’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కావడం విశేషం. రెండో భాగం ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఏప్రిల్‌ 28న రాబోతోన్న తరుణంలో తొలి భాగాన్ని విడుదల చేయడం చక్కటి వ్యూహం. ఇది సరిగా పనిచేస్తే.. విజయం సాధించిన ఇతర చిత్రాలకూ ఆహ్వానం పలకవచ్చు. హిందీ వెర్షన్‌ ‘బాహుబలి ది బిగినింగ్‌’ను రేపు దేశవ్యాప్తంగా 900 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు’ అన్నారు.
 
బాహుబలి తొలి భాగం ముగింపు అత్యద్భుతమైన సస్పెన్స్‌కు తెర వేస్తూ ముగిసిన విషయం తెలిసిందే. బాహుబలిని కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడిచే దృశ్యం ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది నోట ఒక ప్రశ్న నేటికీ నానేటట్లు చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఈ ప్రశ్నకు జవాబు కనుగొనడానికి యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యపడనవసరం లేదు. 
 
బాహుబలి ది బిగినింగ్‌ని మళ్లీ విడుదల చేస్తున్న ధర్మా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు, హిందీ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేస్తూ ప్రేక్షకుల ముందు మరోసారి మ్యాజిక్  చేయడానికి తొలి భాగం వెయ్యి ధియేటర్లలో విడుదల అవుతోందని తెలిపారు. 
Karan Johar ✔ @karanjohar
Over a 1000 screens! Widest RE RELEASE of an Indian film !!! #Baahubali .....experience the magic before the epic releases on the 28th april
 
గతవారం బాహుబలి ది బిగినింగ్ రీరిలీజ్‌ తేదీని ప్రకటించిన సందర్భంగా కూడా కరణ్ హిందీ ప్రేక్షకులను ఈ కళాఖండాన్ని మళ్లీ మననం చేసుకునేందుకోసం తగిన సమయం ఇదేనని ట్వీచ్ చేశారు. ఇంతవరకు ఈ సినిమాను చూడనివారు, చూడలేక పోయిన వారు ఏప్రిల్ 7న అంటే నేడు శుక్రవారం తప్పక చూడాలని సూచించారు.
 Karan Johar ✔ @karanjohar
It's time for refresh the memory of this epic!! And for those who haven't seen it! You can't miss this one! Baahubali re releasing 7th April
 
2015 జూలై 10న దేశ వ్యాప్తంగా 4,000 ధియేటర్లలో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ప్రాంతాల్లో విడుదల అయిన బాహుబలి ది బిగినింగ్ చరిత్ర సృష్టించిన  విషయం తెలిసిందే.  బాహుబలి ది కన్‌క్లూజన్‌’లో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు.