మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (13:33 IST)

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్ర కోసం కొత్త టెక్నాలజీ

దర్శకుడు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం ప

దర్శకుడు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర ఎవరూ చేయబోతున్నారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. బసవతారకం పోలికలతో ఉన్నవారిని ఎంపిక చేసి ఆడిషన్‌కు పిలవాలని బాలయ్య, తేజ భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
ఆడిషన్స్‌తో భారీగా అప్లికేషన్లు- ఫోటోలు కూడా వచ్చాయట. దీంతో ఫోటోలను ఎంపిక చేసుకోవడం తలనొప్పిగా మారడంతో డైరెక్టర్ తేజ కొత్త టెక్నాలజీ వాడుతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ఫేస్ రిక్నగిషన్ అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగించబోతున్నారు. 
 
ఈ సాఫ్ట్‌వేర్ ముఖం ఆకృతి.. కొలతలు.. కవళికలు అన్నీ ఎనలైజ్ చేసి ఎవరి ఫొటో అయితే బవసతారకం ముఖానికి సరిపోతుందో చెప్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా పని సులభంగా పూర్తవుతుందని భావిస్తున్నారట. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం.