బిగ్ బాస్ హౌస్: భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారు..
బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో సౌమ్యుడుగా కొనసాగుతున్న బాలాదిత్య పట్ల సోషల్ మీడియాలో కొంతమంది ప్రశంసలు కురిపించగా మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
బాలాదిత్య అందరితో మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ పలువురు భావిస్తున్నారు.
ఇలా బాలాదిత్య గురించి ఇలాంటి కామెంట్స్ వినిపించడంతో ఆయన భార్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తన భర్త ఇంట్లో ఎలా ఉన్నారో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉన్నారని తాను నిజాయితీగా ఆడుతున్నారని తెలిపారు.అయితే బిగ్ బాస్ హౌస్‌లో కొందరు తన భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ హౌస్‌లో కొంతమంది కంటెస్టెంట్లు ఆయన మంచితనాన్ని వాడుకుంటున్నారని ఈమె బాధపడటమే కాకుండా కొన్ని టాస్కులలో ఆయన నమ్మిన వారే తనని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.