శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:23 IST)

బాలకృష్ణ అఖండ నుంచి తొలి సింగిల్ -అడిగా అడిగా. విడుదల (video)

Akhanda still
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం`అఖండ` మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది చిత్ర యూనిట్‌. దానిలో భాగంగా ఈ రోజు అఖండ ఫ‌స్ట్ సింగిల్ `అడిగా అడిగా`ను రిలీజ్ చేశారు.  
 
ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న త‌మ‌న్ ఈ మెలోడి గీతం కోసం ఒక అద్భుత‌మైన ట్యూన్ ను అందించారు. ఎస్పీ చరణ్, ఎంఎల్ శ్రుతి ఈ పాటను శ్రావ్యంగా పాడారు. కళ్యాణ్ చక్రవర్తి  మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ  పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తుంది.
 
ఇక బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జోడి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. కొరియోగ్రఫీ  అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను సినిమాలంటే కచ్చితంగా మంచి మెలోడీ పాట ఉండాల్సిందే. ఆ కోవలో త‌ప్ప‌కుండా  `అడిగా అడిగా` పాట‌ చేరుతుంది.
 
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సి. రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా  వ్యవహరిస్తున్నారు.