బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (07:41 IST)

బాణం, రాక్షసు డు, షాడో తోలుబొమ్మలాట ,అడవి, కందిరీగ వంటి భిన్నమైన పోస్టర్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం

Bellamkonda Sai Srinivas poster
Bellamkonda Sai Srinivas poster
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా తన 10వ సినిమా ప్రకటించారు. మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి రచన మరియు దర్శకత్వం లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు.
 
పోస్టర్ లో డిటైలింగ్ చూస్తే ఒక అద్భుతమైన భయంకరమైన కథ గా అనిపిస్తుంది. శ్రీరాముడు తన చేతిలో విల్లు తో బాణాన్ని ఆకాశం లో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం ఈ శ్రీరామనవమి సందర్భానికి సరిగ్గా సరిపోయింది. మనం షాడో తోలుబొమ్మలాట ,నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్ మరియు హార్నెట్ కూడా చూడవచ్చు.
 
భగవంత్ కేసరి సంచలన విజయం తర్వాత, షైన్ స్క్రీన్స్ ఈ ఎలక్ట్రిఫైయింగ్ హారర్ మిస్టరీతో వెండితెరపైకి మరల మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ చిత్రం ఆధునిక కథనంతో లైట్ వర్సెస్ డార్క్ కథను పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉంది.
 
అబ్బురపరిచే కథతో సాంకేతికంగా అద్భుతమైన టీం తో కలిసి సరిహద్దులను పుష్ చేయబోతున్నట్టు కనిపిస్తుంది
 
షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిటర్ గా చేయనున్నారు.