గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (13:03 IST)

అన్ని గాయాలను సమయం నయం చేస్తుందంటారు.. కానీ అది నిజం కాదు.. భావన

Bhavana
మలయాళ స్టార్ హీరోయిన్ భావన.. తెలుగు తమిళ సినిమాల్లో నటించింది. కొన్ని కారణాల వల్ల భావన సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం యాడ్స్‌తో పాటు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. 
 
తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అతడితో దిగిన ఫోటోను పంచుకుంటూ భావోద్వేగ పోస్టును పంచుకుంది. "పోరాడుతూనే ఉండండి.. స్వర్గంలో ఉన్న వ్యక్తి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. సమయం అన్ని గాయాలను నయం చేస్తుందని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 
Bhavana
Bhavana


భావన నటనా జీవితంలో స్టార్‌కి అవసరమైన మద్దతునిచ్చింది ఆమె తండ్రి బాలచంద్ర. కానీ ఆమె తండ్రికి ఆకస్మాత్తుగా రక్తపోటు పెరగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మరణించి తొమ్మిదేళ్లు అయ్యాయి. ఈ ఏడాది ఆయన వార్షికోత్సవం సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుంది భావన. తన తండ్రి మరణం వల్ల కలిగిన గాయం చనిపోయే వరకు ఉంటుందని గతంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.