బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (08:37 IST)

అరెస్టు వెనుక ఆర్థిక, రాజకీయ, అంగబలం : ముంబై నటి జెత్వానీ

kadambari jaitwani
తన అక్రమ అరెస్టు వెనుక ఆర్థి, రాజకీయ అంగబలం పుష్కరంగా ఉందని ముంబై నటి కాందబరి జెత్వానీ అన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు స్పందించి, అక్రమ అరెస్టు వెనుక ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం శుభపరిణామన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అక్రమ అరెస్టు వెనుక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు రాజకీయ ప్రభావం కూడా ఉందన్నారు. తాను ముంబైకు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్తపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసేందుకు తనను, తమ కుటుంబాన్ని అన్యాయంగా వేధింపులకు గురిచేశారన్నారు. తమపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా, తాను బెయిల్‌పై విడుదల చేయడానికి ముందు తనను 42 రోజుల పాటు ఏపీ పోలీసులు అక్రమగా నిర్బంధించారన్నారు. 
 
'అరెస్టులో చాలా రాజకీయ నేతల హస్తం, డబ్బు, అధికారం ఉందని నేను నమ్ముతున్నాను. ఆ స్థాయిలో డబ్బు, అధికారం లేకుండా, నేను చెప్పే ఈ స్థాయిలో అక్రమ అరెస్టు జరిగేది కాదని నేను నమ్ముతున్నాను. రాజకీయ ప్రభావం, డబ్బు, అధికారం ఇమిడి ఉన్నాయి' అని కాదంబరి జెత్వాని అన్నారు.
 
సరైన మార్గదర్శకాలు పాటించకుండా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కె.విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు నటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేసిన, ఆ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
 
మోడల్ అరెస్టులో పాత్ర పోషించారనే ఆరోపణలపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.సీతారామాంజనేయులు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (విజయవాడ) విశాల్ గున్నిలపై ఏపీ ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఏ పోస్టును కేటాయించకుండానే డిజిపి కార్యాలయంలో రోజుకు రెండుసార్లు హాజరు పట్టీలో సంతకం చేయాలంటూ ఆగస్టు 14వ తేదీన మెమో జారీ చేసిన 16 మంది ఐపీఎస్‌ అధికారుల్లో ఇపుడు సస్పెండ్‌కు గురైన ముగ్గురు అధికారులు కూడా ఉండటం గమనార్హం.