లాలా... భీమ్లా... నాయక్ దెబ్బకు బాక్స్ బద్దలే ... 24 గంటల్లో సరికొత్త రికార్డు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. వకీల్ సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన... ఇపుడు భీమ్లా నాయక్‌గా సంక్రాంతికి రానున్నారు. ఈ మూవీని అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళ రీమేక్‌గా సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ టైటిల్‌ను, ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ ఆగస్ట్ 15వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఫస్ట్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, అగ్రెసివ్ ఆటిట్యూడ్‌తో అభిమానులకు పూనకాలు తెప్పించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంది. దీంతో ఫస్ట్ గ్లింప్స్ వీడియో పలు రికార్డులు నమోదు చేస్తుంది.
టాలీవుడ్‌లో 24 గంటలలో ఎక్కువ మంది చూసిన ఫస్ట్ గ్లింప్స్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో 8.49 మిలియన్ వ్యూస్‌తో పాటు 728.6 వేల లైక్స్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించింది.
అంతకు ముందు సైరా నరసింహా రెడ్డి.. 7.2 మిలియన్స్ వ్యూస్ , 287కె వ్యూస్, రాధే శ్యామ్ .. 5.07మిలియన్ వ్యూస్‌తో పాటు 394కె లైక్స్ సాధించాయి. పవన్ అభిమానులు సృష్టించిన భీబత్సంతో భీమ్లా నాయక్ ఖాతాలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.