శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (10:10 IST)

'వెలుగు' వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం

ప్రస్తుతం సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు చక్కర్లు కొట్టడం కొత్తేమీ కాదు. తాజాగా 'వెలుగు' వాట్సాప్ గ్రూపులో ఓ అభ్యంతరకర వీడియో కలకలం రేపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో ఓ 'నీలి' వీడియో పోస్టు అయింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 
 
గ్రూపులోని మహిళలు ఆ వీడియో చూసి షాకయ్యారు. అది కూడా ఈ వీడియోను 'వెలుగు' ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం పోస్టు చేయడం మరింత చర్చకు దారితీసింది. వీడియో పోస్టు కావడంపై బాలసుబ్రహ్మణ్యం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. 
 
తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున అందులో పోస్టు అయినట్టు చెప్పారు. ఈ విషయంలో తన తప్పు లేదని, అయినప్పటికీ కొందరు కావాలని తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకు వీడియోను ఇతరులకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో పోస్టు అయినందుకు గ్రూపు సభ్యలుకు నేరుగా క్షమాపణలు చెప్పానని వివరించారు.