గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (12:39 IST)

భీమ్లానాయ‌క్ వేడుక వాయిదా వేస్తున్నా - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawn kalyan letter
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా ఈనెల 25న విడుద‌ల‌కానున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కార్య‌క్ర‌మాన్ని ఈరోజు అన‌గా ఫిబ్ర‌వ‌రి 21న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్‌లో ఘ‌నంగా ఏర్పాటుకు స‌న్నాహాలు చేశారు. అందుకు తెలంగాణ మంత్రి కె.టి.ఆర్. కూడా హాజ‌రు కాబోతున్నారు.
 
కానీ అక‌స్మాత్తుగా.. త‌మ వేడుక నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్న‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈరోజు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో వేడుక చేసుకోవ‌డానికి నాకు మ‌న‌స్సు అంగీక‌రించ‌డంలేదు. అందుకే నేడు జ‌ర‌గాల్సిన వేడుక‌ను వాయిదా వేసుకుంటున్నా. కానీ త్వ‌ర‌లో వేడుక చేస్తాం. వివ‌రాలు నిర్మాణ సంస్థ తెలియ‌జేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.
 
రానా ద‌గ్గుబాటి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఈ సినిమా క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డుతూనే వుంది. ఎట్ట‌కేల‌కు విడుద‌ల స‌మ‌యానికి ఓ వేడుక జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. బ‌హుశా ఈనెల 23వ తేదీన ఆ వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.