శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (12:06 IST)

బాత్రూమ్ సీన్ షూటింగ్‌లో జారిపోయిన దుస్తులు... లీక్ చేసిన నిర్మాత

ఓ భోజ్‌పురి నటికి చేదు అనుభవం ఎదురైంది. బాత్రూమ్ సీన్ షూటింగ్ సమయంలో ధరించిన దుస్తులు జారిపోయాయి. అపుడు షూట్ చేసిన సన్నివేశాలను ఆ చిత్ర నిర్మాత ఉపేద్ర కుమార్ యధావిధిగా ఇంటర్నెట్‌లో పెట్టారు. దీంతో బాధ

ఓ భోజ్‌పురి నటికి చేదు అనుభవం ఎదురైంది. బాత్రూమ్ సీన్ షూటింగ్ సమయంలో ధరించిన దుస్తులు జారిపోయాయి. అపుడు షూట్ చేసిన సన్నివేశాలను ఆ చిత్ర నిర్మాత ఉపేద్ర కుమార్ యధావిధిగా ఇంటర్నెట్‌లో పెట్టారు. దీంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిర్మాత ఉపేద్ర కుమార్ సారథ్యంలో నిర్మితమైన ఓ చిత్రంలో భోజ్‌పురి నటి ఒకరు నటించారు. గత యేడాది ముంబై అంథేరిలోని నిర్మాత కార్యాలయంలోనే మూడు రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో స్నానపు గదిలో సన్నివేశాలు చిత్రీకరించారు. అపుడు పొరపాటున నటి దుస్తులు జారిపోయాయి. 
 
దుస్తులు జారిపోయిన సన్నివేశాన్ని కూడా షూట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ దృశ్యాలు ఇంటర్నెట్‌తో పాటు. మూడు పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం తెలుసున్న నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిర్మాత ఉదయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. కాగా, తాను చేసిన తప్పుకు భయపడిపోయిన ఉపేంద్ర కుమార్ వర్మ పారిపోయారు. తన సమాచారం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, సిమ్ కార్డు కూడా మార్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు ముంబైలోని వర్సోవా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.