గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:03 IST)

కౌశల్‌ను వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న తనీష్... ఏమైంది?

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఎంతో పాజిటివ్‌గా ముగిసింది. ఇంకో మూడు రోజులు మాత్రమే మనకీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండగా, హౌస్‌మేట్స్‌లో ఇప్పటికే హౌస్ నుండి వెళ్లిపోతున్నామనే బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఎంతో పాజిటివ్‌గా ముగిసింది. ఇంకో మూడు రోజులు మాత్రమే మనకీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండగా, హౌస్‌మేట్స్‌లో ఇప్పటికే హౌస్ నుండి వెళ్లిపోతున్నామనే బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకేనేమో బిగ్ బాస్ కూడా ఇక నెగెటివ్ టాస్క్‌లు, శారీరక టాస్క్‌లు మానేసి హౌస్‌మేట్స్ మధ్య అనుబంధాలను పెంచేలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాడు. 
 
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో చూసుకుంటే, ఇప్పుడు ఫైనల్‌కి వెళ్లి ఇంట్లో మిగిలిన ఐదుగురి సభ్యుల ప్రయాణాన్ని వీడియోల రూపంలో చూపి, ఒక్కొక్కరిలోని మంచి లక్షణాలను చెప్తూ బిగ్ బాస్ అందర్నీ మురిపించారు. దీంతో హౌస్‌మేట్స్ భావోద్వేగానికి లోనై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇక తనీష్ అయితే ఏకంగా కౌషల్‌ను వాటేసుకుని ఈ ఇంట్లో నుండి వెళ్లాలని లేదని కంటతడి పెట్టుకున్నారు. 
 
బిగ్‌బాస్ ముగింపు దశకు చేరుకున్నా కూడా కౌషల్ తన పనిలో తనున్నాడు. దీప్తి తప్పులు ఎత్తి చూపుతూ, ఆమె టాస్క్‌లలో ఆడుతున్నప్పుడు డిఫెన్స్ మోడ్‌లోనే ఉంటారని, తర్వాత తను సలహాలు ఇచ్చి ప్రోత్సహించిన తర్వాతనే అటాక్ మోడ్‌లోకి వచ్చారని కౌషల్ గొప్పలు చెప్పుకోగా, దీప్తి కౌంటర్ ఇస్తూ "మీరలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ మీ వల్ల జరిగిందనుకోవడం పొరపాటు, నేను నాలాగే నా గేమ్ ఆడాను" అని స్పష్టం చేసారు. 
 
తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వగా, అందులో గీత, కౌషల్ విజేతలుగా నిలిచారు. ఇక దీప్తి పాటందుకోగానే దయచేసి ఆపండి అంటూ కౌషల్ రిక్వెస్ట్ చేయడం, అయినప్పటికీ కనకేమీ పట్టనట్టు దీప్తి ఊగుతూ పాట పాడగా, తనీష్ మధ్యలో ‘‘పాట పాడితే సరిపోతుంది, ఊగక్కర్లేదు’’ అని చెప్పగా, వెంటనే కౌషల్ అందుకుని, ‘‘ఆమె అంతే, ఏదైనా ఊగుతూనే చేస్తారు’’ అనడంతో ఇల్లంతా నవ్వుల పూలు పూశాయి. 
 
ఇక రేపటి ఎపిసోడ్‌లో మొదటి నుండి ఎలిమినేట్ అయ్యిన మిగతా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ హౌస్‌లోకి వచ్చి, ఫైనలిస్ట్‌లతో సరదాగా గడుపుతూ సందడి చేయనున్నట్లు ప్రోమో చూపారు.