గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (10:57 IST)

పవన్ రెమ్యునరేషన్ లెక్కలు ఎవడికీ చెప్పాల్సిన పనిలేదు : "బ్రో" నిర్మాత విశ్వప్రసాద్

bro movie
"బ్రో" చిత్రం కోసం హీరో పవన్ కళ్యాణ్‌కు ఎంత పారితోషికం చెల్లించామనే లెక్కలు ఎవడికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. అలాగే. ఈ చిత్రంపై మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శల మీద కూడా ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంబటి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. తాము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించామన్నారు. 
 
నెట్ ఫ్లిక్స్, జీ తెలుగు తమకు ఆదాయ మార్గాలు అన్నారు. విదేశాల నుండి డబ్బులు వచ్చాయన్న మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అమెరికా నుండి ఇండియాకు నల్లధనం తీసుకురావడం అసాధ్యమని చెప్పారు. విదేశాల నుండి వచ్చిన డబ్బుకు భారత రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉంటాయని, ఆర్బీఐ అనుమతి ఇస్తేనే ఇక్కడకు తీసుకుని రాగలమన్నారు. 
 
ఇకపోతే, పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్, ఈ సినిమాకు అయిన ఖర్చును చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఓటీటీలో తమకు మంచి బిజినెస్ ఉందని, తాము ప్రొడక్షన్‌లోకి వచ్చి అయిదేళ్లవుతోందన్నారు. అంబటి చెబుతున్న శ్యాంబాబు క్యారెక్టర్ ఆయనకు సంబంధం లేదన్నారు. ఇందులో డ్రెస్ ఒకటే మ్యాచ్ అయిందని, అయినప్పటికీ శ్యాంబాబు క్యారెక్టర్ తమకు నెగిటివ్‌గా అనిపించలేదని తెలిపారు. క్రియేటివ్ ఉంటుందనే బ్రో సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టినట్లు చెప్పారు.