ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (16:31 IST)

సోహైల్ న‌టించిన మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి పాట ఆవిష్క‌రించిన బుచ్చిబాబు

Sohail, Buchibabu, Annapareddy Appireddy and ohters
‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా లిరికల్ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. 
 
తాజాగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలోని 'కథ వేరుంటది' పాటను సంక్రాంతి పండగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. కథ వేరుంటది పాట చాలా బాగుందన్న బుచ్చిబాబు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్ కు బెస్ట్ విశెష్ తెలిపారు.
 
కథ వేరుంటది పాట ఎలా ఉందో చూస్తే..ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా.. నిన్నుచూసి పుట్టుకొచ్చె గుండెలో దడ.. ఓ అల్లరోడా, బుగ్గ గిల్లి సూడ.. సందమామ రాతిరేల దిష్టి కొట్టడా..మాసు లుక్కులోడా నువు ఊ అంటే చాలు కథ వేరుంటది...సొట్ట సెంపలోడా నువు సై అంటే సాలు కథ వేరుంటది ..అంటూ హీరోపై హీరోయిన్ అడ్మిరేషన్ చూపిస్తూ సాగుతుందీ పాట. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్నందించిన కథ వేరుంటది పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా...నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా పాటతో సోషల్ మీడియాను ఊపేసిన గాయని మోహన భోగరాజు పాడారు.
 
హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి. తుది హంగులు అద్దుకుంటున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటులు :  సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు 
 
సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, రచన-దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి