సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:12 IST)

జిగేల్ రాణిని మించిన పాయల్... 'బుల్ రెడ్డి..' సాంగ్‌లో రెచ్చిపోయిన ఆర్ఎక్స్ భామ

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సీత. ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది. పైగా, మంచి పేరు కూడా వచ్చేసింది.
 
ప్రస్తుతం "వెంకీమామ" చిత్రంలో విక్టరీ వెంకటేష్ స‌ర‌స‌న నటిస్తుంది. ర‌వితేజ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది. అయితే "సీత" సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెం గార్ల్ అవతారమెత్తింది. 'బుల్‌ రెడ్డి...' అనే పెప్పీ మాస్‌ సాంగ్‌లో అభినయం, నృత్యం, గ్లామర్‌తో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 
 
ఇటీవల చిత్ర లిరికల్ సాంగ్ విడుదల చేసిన టీం తాజాగా "బుల్‌ రెడ్డి...'' సాంగ్ వీడియో ప్రోమో విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్‌ గోమటం, అభిమన్యుసింగ్‌ నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని టీం చెబుతుంది.