బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:43 IST)

అల్లు అరవింద్ ఆవిష్క‌రించిన‌ కాలింగ్ సహస్ర టీజర్

Sudheer, Allu Arvindh, Vijesh kumar Tayal Arun Vikkirala
జబర్దస్త్ కమెడియన్‌గా, ప్రోగ్రాం హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలు విడుదలై ప్రేక్షకుల రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు 'కాలింగ్ సహస్ర' అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుడిగాలి సుధీర్.
 
శుక్ర‌వారంనాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కాలింగ్ సహస్ర టీజర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు అల్లు అరవింద్. ఒక నిమిషం 18 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే గతంలో ఎన్నడూ చూడని సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది. 'బ్రతకడం కోసం చంపడం సృష్టి దర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది' అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం మిస్టరీని తలపించింది. 'చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా, మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్ళు పోవడం' అంటూ ఈ మూవీలో లవ్ యాంగిల్ కూడా ఉందని చూపించారు.
 
రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించగా.. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించారు. సుధీర్ ఆనంద్ భయాన, శివ బాలాజీ మనోహరన్, డోలీషా, స్పందన పల్లి, మనాలి రాథోడ్, రవితేజ నన్నిమాల కీలకపాత్రలు పోషించారు. మోహిత్ రహ్మణియక్ సంగీతం అందించారు. 
 
నటీనటులు: సుధీర్ ఆనంద్ భయాన, శివ బాలాజీ మనోహరన్, డోలీషా, స్పందన పల్లి, మనాలి రాథోడ్, రవితేజ నన్నిమాల. 
కథ, దర్శకుడు: అరుణ్ విక్కీరాల
నిర్మాణ సంస్థలు: రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్
ప్రొడ్యూసర్స్: విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి
DOP: సన్నీ D 
మ్యూజిక్: మోహిత్ రహ్మణియక్ 
యాక్షన్: శివరాజ్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ R, 
ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణ్ కోయిలడా
ప్రొడక్షన్ డిజైన్: తాళ్లూరి మణికంఠ,