గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (17:09 IST)

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

Praneeth Hanumantu
Praneeth Hanumantu
లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్, ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదైంది.
ఈ వీడియోను నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసి యూట్యూబర్, ఇతరులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడంతో కేసును నమోదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ డీజీపీ రవి గుప్తా, చిన్నారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
"పౌరులందరినీ, ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే నేరస్థులపై చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని చెప్పారు.