సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:43 IST)

నయన్ సినిమాపై నెగెటివ్ కామెంట్స్.. ప్రియుడిపై కేసు పెడతానంటూ నిర్మాత ఫైర్

లేడీ సూపర్‌స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఆమె నటించిన కొలయుతిర్ కాలం చిత్రంపై నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ నెగెటివ్ టాక్‌ను తెచ్చిపెడుతున్నాయని మండిపడుతున్నారు ఈ చిత్ర నిర్మాత మథియా లగాన్. త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు చక్రి తోలేటి డైరెక్టర్. 
 
ఇటువంటి సమయంలో విఘ్నేష్ చేసిన వ్యాఖ్యల వలన ఈ సినిమాను కొనడానికి ఆసక్తిగా ఉన్న బయ్యర్లు కూడా వెనక్కు తగ్గే అవకాశం ఉంది. ఈ సినిమాను ఎవరూ కొనకుంటే నా పరిస్థితి ఏంటని నిర్మాత ప్రశ్నించారు. నాకు జరిగే నష్టాన్ని పూడ్చకుంటే విఘ్నేష్ శివన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మథియా లగాన్ స్పష్టం చేసారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో విఘ్నేష్ వ్యాఖ్యల వలన ఇప్పుడు ఎవరూ ఆసక్తి చూపడం లేదని అన్నారు.
 
ఇప్పటికే కొలయుతిర్ కాలం సినిమాలో నయనతార పాత్రపై ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి వ్యాఖ్యానిస్తూ.. నయనతారని చూస్తే దెయ్యాలే పారిపోతాయి. ఆమె మళ్ళీ దెయ్యం పాత్రలో నటిస్తోందని చెప్పగా, తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఒకటి పోతే మరొక వివాదం వస్తూనే ఉంది.