గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:37 IST)

హృతిక్ రోషన్‌తో వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే

War 2
War 2
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న వార్ సినిమా ద్వారా ఆర్ఆర్ఆర్ స్టార్, టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారు. 
 
బాలీవుడ్‌ టాప్ హీరో సూపర్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రాబోయే యాక్షన్ చిత్రం "వార్ 2"లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో తలపడనున్నాడు యంగ్ టైగర్. ఈ యాక్షన్ చిత్రం యాక్షన్ డ్రామా "వార్" సినిమాకు సీక్వెల్. 
 
ఒరిజినల్‌లో, హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ ఇద్దరూ ఒకరికొకరు వార్ చేసుకున్నారు. ఫాలోఅప్‌లో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా "RRR" అద్భుత విజయాల నేపథ్యంలో ఎన్టీఆర్ హోదా ఆకాశానికి ఎగసిందనే చెప్పాలి.
 
అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన అతికొద్ది మంది భారతీయ ప్రముఖులలో యంగ్ టైగర్ ఒకరిగా నిలిచారు. కాబట్టి ఎన్టీఆర్‌ని వార్ 2లో జోడించడం వల్ల ఈ సీక్వెల్‌కు మరింత మెరుపు - గ్లామర్ లభిస్తుందని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారు. దీంతో నార్త్ ఇండియన్ మార్కెట్లో ఎన్టీఆర్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోగలుగుతాడు.