శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (11:20 IST)

అఖిల్ అక్కినేని రెండో సినిమా.. ''హలో'' ఫస్ట్ లుక్ రిలీజ్.. వీడియో చూడండి..

అఖిల్ అక్కినేని నటిస్తున్న రెండో సినిమాకు టైటిల్ ఖరారైంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పేరును ''హలో'' అని ఖరారు చేశారు. ఈ విషయాన్ని నాగార్జున సోమవారం ట్విట్టర్‌లో వీడియ

అఖిల్ అక్కినేని నటిస్తున్న రెండో సినిమాకు టైటిల్ ఖరారైంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పేరును ''హలో'' అని ఖరారు చేశారు. ఈ విషయాన్ని నాగార్జున సోమవారం ట్విట్టర్‌లో  వీడియో ద్వారా తెలియజేశారు. 
 
నాగార్జున ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఎన్టీఆర్‌, కాజల్‌, ప్రభాస్‌, శ్రుతిహాసన్‌, నాగచైతన్య, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సమంత, సూర్య, నాని, వెంకటేష్‌, రాజమౌళి, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రానా వంటి స్టార్ సెలెబ్రిటీలు హలో అంటూ సినిమా పేరును ప్రకటించారు.

అక్కినేని నాగేశ్వరరావు పాట "హలో హలో అమ్మాయి.."తో ఆ వీడియో పూర్తవడం విశేషం. అందరూ ఊహించినట్లే హలో అనే పేరును అఖిల్ సినిమాకు ఖరారు చేసినట్లు నాగార్జున వెల్లడించారు. 
 
మనం ఫేమ్ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రాలకి రెండు అక్షరాల పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌ని అనుసరిస్తూ హలో అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కే ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.