చంద్రబాబు అరెస్ట్ సుసైడ్‌తో సమానమా! సీనియర్ నరేష్ సంచలన వ్యాఖ్య
తెలుగుదేశం నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడం తెలిసిందే.దీనిపై దేశమంతా ధర్నాలు, దీక్షలు జరుగుతూనే వున్నాయి. దీనిపై ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి మోడీ కూడా ఏమీ స్పందించలేదు. ఇదిలావుంటే అసలు చనలచిత్రరంగంలో చంద్రబాబునాయుడు అంటే విడదీయలేని అనుబంధం వుంది. దీనిపై కొద్దిరోజుల క్రితం నిర్మాతలు కె.ఎస్.రామారావు, రవిబాబు, నట్టికుమార్ వంటి కొద్ది మంది మినహా పెద్దగా స్పందించలేదు.
కానీ ఏదైనా సినిమా ఫంక్షన్‌కు జరిగితే అక్కడ హీరోలకు, ప్రముఖ దర్శకులకు, నిర్మాతలకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కరెక్టా కాదా? అనే ప్రశ్న విలేకరులనుంచి వస్తుంది. తాజాగా పవిత్ర లోకేష్ భర్త అయిన సీనియర్ నరేష్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. తాజాగా ఆయన ఆహా! అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్ సిరీస్ చేశాడు. దానిపేరు ది గ్రేట్ ఇండియన్ సుసైడ్. ఇందులో పత్రిలోకేష్, హెబ్బాపటేల్ నటించింది. ఈనెల 6న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రమోషన్‌లో భాగంగా నరేష్‌కు చంద్రబాబునాయుడు అరెస్ట్ గురించి స్పందించమని అడిగితే, వెంటనే ఆయన తన టైటిల్ వున్న పోస్టర్‌ను చూపించి ది గ్రేట్ ఇండియన్ సుసైడ్ అని ముగించారు. అంటే చంద్రబాబు అరెస్ట్ సుసైడ్ అంటున్నారా? అని మరో ప్రశ్న వేస్తే నేను చెప్పింది నా వెబ్‌సీరిస్ అంటూ తెలివిగా దాట వేశారు. సో. నిజంగా ది గ్రేట్ ఇండియన్ సుసైడ్ చంద్రబాబుకా, జగన్ కా? అనేది డైలమాలో పడేశారు.