శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (22:12 IST)

నెగటివ్ మనుషుల గురించి మాట్లాడిన ఛార్మీ

charmi
నెగటివ్ మనుషులపై సినీ నటి ఛార్మీ ఇన్ స్టాలో పోస్టు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఎప్పుడూ సరదాగా ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేసే ఛార్మీ... నెగిటివ్ మనషులు గురించి మాట్లాడింది. ఒకప్పుడు వరుస సినిమాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఛార్మీ కౌర్. కానీ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది. 
 
నెగిటివ్ ఆలోచనలు కలిగిన మనుషులను అలాగే వదిలేయ్యాలి. అలాంటి నెగిటివ్ మైండ్‏తో.. అవే ఆలోచనలతో జీవిస్తారు. కానీ నాకు మాత్రం కచ్చితంగా ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయ్.. అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.