బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (15:04 IST)

రెండు పార్ట్ లు గా ‘చియాన్ 62 .థ్రిల్లింగ్ అనౌన్స్‌మెంట్

Chiyan 62 poster
Chiyan 62 poster
ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను పోషించి న‌టుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న చియాన్ విక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం ‘చియాన్ 62’కు (వ‌ర్కింగ్ టైటిల్‌) సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. దీనికి సంబంధించిన వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప‌న్నైయారుమ్ ప‌ద్మినియుమ్‌, సేతుప‌తి, సిందుబాద్ స‌హా రీసెంట్‌గా విడుద‌లైన సూప‌ర్ చిత్రం చిత్తా (చిన్నా) వంటి డిఫ‌రెంట్ మూవీస్‌ను తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడు ఎస్‌.యు.అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 
 
ఈ ఇంటెన్స్ గ్రిప్పింగ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు జాతీయ అవార్డ్ గ్ర‌హీత జి.వి.ప్ర‌కాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. హెచ్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చియాన్ 62వీడియో గ్లింప్స్‌లో వెర్స‌టైల్ యాక్ట‌ర్ విక్ర‌మ్ అద్భుత‌మైన యాక్ష‌న్‌ను మ‌నం చూడొచ్చు. ఇవి ఈ చిత్రంలో పార్ట్ 1కు సంబంధించిన స‌న్నివేశాలు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. 
 
ఇప్ప‌టికే ధృవ న‌క్ష‌త్రం, తంగ‌లాన్ చిత్రాల‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో  ఫుల్ ఎంజాయ్ చేస్తున్న చియాన్ విక్ర‌మ్ ఫ్యాన్స్‌కి తాజాగా చియాన్ 62 వీడియో అనౌన్స్‌మెంట్ మ‌రింత సంతోషాన్ని ఇచ్చింది.